హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మామిడి కవర్లపై రైతులకు 50 శాతం సబ్సిడీ'

NGKL: పెద్దకొత్తపల్లి మండల మామిడి రైతులకు 50 శాతం సబ్సిడీపై కవర్లు అందించనున్నట్లు ఉద్యాన శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. వీటితో కాయలకు పురుగులు, తెగుళ్ల నుంచి రక్షణతోపాటు నాణ్యత, రంగు మెరుగవుతాయన్నారు. రైతులు నవంబర్ 10లోగా పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా ప్రతులు, ఫొటోతో కొల్లాపూర్ ఉద్యాన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.