హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి: ఏఐటీయూసీ

ADB: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య, వాటర్ సప్లై కార్మికుల పెండింగ్ వేతనాలు, పీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్‌కు యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రతి నెలా 1 నుంచి 10వ తేదీలోపు వేతనాలు ఇవ్వకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.