హైదరాబాద్: 28°C
తెలంగాణ

10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్

ADB: రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా జిల్లాలో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం తెలిపారు. ఆదిలాబాద్, బేల, ఇచ్చోడ, ఉట్నూర్ తదితర ప్రాంతాల్లో ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని, నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు.