హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన

JN: వడ్లకొండలో యేన చెరువుకు గోదావరి జలాలు మళ్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. చెరువులో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. వెంటనే చెరువును నింపాలని, లేదంటే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ధర్నాతో ప్రధాన రహదారిపై 2 కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.