హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుంతల మయంగా రోడ్డు.. విద్యార్థుల ఇక్కట్లు

PDPL: ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌కు వెళ్లే దారిలో రహదారి అధ్వానంగా మారింది. మోడల్‌ స్కూల్‌, కొత్తపల్లికి వెళ్లే మూలమలుపు వద్ద రోడ్డుపై గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. తరచూ గుంతల్లో నీరు నిలుస్తుండటంతో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.