BDK: మణుగూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న 14 మంది వాటర్ సప్లై కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. దసరాలోపు వేతనాలు చెల్లించాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
వాటర్ సప్లై కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కల్పించాలి


