హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సర్పంచ్

BHNG: రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామంలో శుక్రవారం అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ ఇంజ లక్ష్మీ ఘనంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఈ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.