హైదరాబాద్: 28°C
తెలంగాణ

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి: పీయూ వీసీ

MBNR: యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పీయూ వీసీ ప్రొఫెసర్ జి. ఎన్. శ్రీనివాస్ అన్నారు. ధర్మాపూర్ జేపీఎన్‌సీఈలో జయప్రకాశ్ నారాయణ ట్రోఫీ–2026 సీనియర్ పురుషుల ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. జేపీఎన్‌సీఈ ఛైర్మన్ రవికుమార్ పాల్గొన్నారు.