హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నాణ్యతతో పనులు పూర్తి చేయాలి'

NRML: భైంసా మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో జరుగుతున్న నాలా నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ తూమొల్ల దత్తాత్రి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.