హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ప్రిన్సిపల్ రాధిక అధ్యక్షతన విద్యార్థులు బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చి ముందస్తు బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని బతుకమ్మతో భక్తిశ్రద్ధలతో పూజించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రేపటి నుంచి ఈనెల 21 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.