BHPL: రేగొండ మండల కేంద్రంలో బస్టాండ్ సౌకర్యం లేక ప్రయాణికులు ఎండ, వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిలువ నీడ లేక సమీపంలోని చెట్ల కింద బస్సుల కోసం వేచి చూస్తున్నారు. 9 నెలల క్రితం MLA గండ్ర బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
శంకుస్థాపనకే పరిమితమైన బస్టాండ్ నిర్మాణం!


