BDK: జిల్లాలో సింగరేణి సంస్థలో పనిచేస్తున్న హిందూ ఉద్యోగులకు దసరా పండుగ అడ్వాన్స్ చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. రెగ్యులర్, బదిలీ ఉద్యోగులు, ట్రైనీలకు రూ.25 వేలు, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు రూ.12,500 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మొత్తాన్ని 10 సమాన వాయిదాల్లో తిరిగి వసూలు చేయనున్నారు.
తెలంగాణ
సింగరేణి ఉద్యోగులకు దసరా అడ్వాన్స్


