హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో భానుడి భగభగలు.. రైతుకు కష్టాలు

WGL: ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు వారాలుగా ఎండల తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు చేరుతున్నాయి. దీంతో పలు గ్రామాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాలకు SRSP కాలువల ద్వారా నీటిని విడుదల చేసినా మిగతా గ్రామాలకు ఇంకా అందలేదు. అధికారులు స్పందించి వెంటనే సాగునీరు అందించాలన్నారు.