హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరాకు ఊరెళ్తున్నారా?.. జాగ్రత్త

JGL: దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. తలుపులు, తాళాలు పటిష్టంగా ఉంచుకోవాలని, చోరీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో రాత్రి వేళ పోలీసు గస్తీని ముమ్మరం చేసినట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.