హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

BHPL: బతుకమ్మ, దసరా సెలవు సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లేవారు ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ గౌడ్ సూచించారు. సీసీ కెమెరాలు, మోషన్ అలారాలు ఏర్పాటు చేసి, తలుపులు, కిటికీలకు పటిష్ఠమైన తాళాలు వేయాలన్నారు. బంగారం, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని, ఖాళీ ఇళ్ల వివరాలను పోలీసులకు తెలియజేయాలని సూచించారు.