హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి ఉద్యోగులకు రూ.25 వేల దసరా అడ్వాన్స్..!

KMM: సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం దసరా అడ్వాన్స్ ప్రకటించింది. రెగ్యులర్, బదిలీ కార్మికులు, ట్రైనీలకు రూ.25,000, తాత్కాలిక సిబ్బందికి రూ.12,500 చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎలాంటి వడ్డీ లేకుండా ఈ మొత్తాన్ని 10 సమాన వాయిదాల్లో జీతాల నుంచి వసూలు చేయనున్నారు. పండుగ వేళ అడ్వాన్స్ అందడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.