తెలంగాణ
VIDEO: రోడ్డు పనులతో పంటలకు నష్టం
GWDL: కర్నూలు-రాయచూరు అంతర్రాష్ట్ర రోడ్డు పనుల కారణంగా గట్టు మండలం మిట్టదొడ్డి శివారులో ఎగసిపడుతున్న దుమ్ము ధూళికి పత్తి, మిరప, కంది పంటలు గిడసబారిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల దిగుబడి తగ్గి నష్టం జరుగుతుండటంతో, రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి తమను ఆదుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.


