MHBD: అవయవ దానంపై అపోహలు వీడి ప్రజలు అవగాహన పెంచుకోవాలని జిల్లా అవయవదాతల సంఘం అధ్యక్షుడు పరకాల రవీందర్ రెడ్డి అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ మాన్యత ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పలువురు దానానికి అంగీకార పత్రాలు అందజేశారు. ఆలయ వాచ్మెన్ జాటోత్ భద్రు తన మరణానంతరం శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసేందుకు అంగీకరించారు.
తెలంగాణ
అవయవ దానంపై అపోహలు వీడండి


