హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ కిట్ల పంపిణీ

MBNR: భూత్పూర్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) శానిటేషన్ కిట్లు పంపిణీ చేశారు. పట్టణ పరిశుభ్రత కోసం శ్రమించే కార్మికుల ఆరోగ్య భద్రతకు కిట్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విధి నిర్వహణలో రక్షణ చర్యలు పాటించాలని, కార్మికుల సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు.