హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ పండగ ఏర్పాట్ల పరిశీలన

NZB: ముప్కాల్ మండలం వేంపల్లిలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం పరిశీలించారు. ఊర చెరువు వద్ద స్థలం, రహదారిని పరిశీలించి ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరమ్మతులు చేపడుతున్నట్లు సర్పంచ్ మహేష్ యాదవ్ తెలిపారు. విద్యుత్ సదుపాయంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.