హైదరాబాద్: 28°C
తెలంగాణ

కీసరగుట్ట ఆలయంలో వైభవంగా రుద్రహోమం

MDCL: మాసశివరాత్రి సందర్భంగా శుక్రవారం కీసరగుట్ట శ్రీ భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకులు రుద్రహోమం నిర్వహించారు. వేదమంత్రాల నడుమ హోమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. పలువురు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.