JGL: దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని పెగడపల్లి ఎస్సై కుమారస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం పెగడపల్లి పోలీస్ స్టేషన్‌లో మాట్లాడుతూ.. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
తెలంగాణ
దసరా వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్సై


