జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లికి చెందిన 45 రోజుల చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. జ్వరం రావడంతో కరీంనగర్‌లో చికిత్స చేయించి బైక్‌పై తిరిగివస్తుండగా, రామడుగు మండలం గోపాలరావుపేట వద్ద తల్లి కవిత చున్నీ బైక్ చక్రంలో ఇరుక్కుంది. దీంతో తల్లీకూతుళ్లు కిందపడగా, తీవ్ర గాయాలతో చిన్నారి మృతిచెందింది.
తెలంగాణ
బైక్‌పై నుంచి పడి పసికందు మృతి


