హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాలి కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి'

ASF: బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ని శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో మాలి కులస్తుల ప్రతినిధులు కలిశారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో మాలి కులస్తులకు భవనం నిర్మించి ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన మాలి కులస్తుల అభివృద్ధికి మాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు.