హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండారెడ్డిపల్లిలో సీఎం దసరా పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

NGKL: వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా ఉత్సవాల్లో పాల్గొననున్న నేపథ్యంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులతో ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయాల అలంకరణ, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.