హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VZM: ఎస్ కోట మండలం పోతనాపల్లిలో పది లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇవాళ  శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులను సకాలంలో నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.