ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ సంబరాల్లో పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ వేడుకలు


