హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కారు బోల్తా.. వ్యక్తి మృతి..!

కృష్ణా: నందివాడ మండలం గండేపూడి వద్ద కారు బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు గాయపడగా, చికిత్స పొందుతూ తుమ్మలపల్లికి చెందిన కుచర్లపాటి సామియేలు మృతి చెందారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. గాయపడిన సునీల్, సురేష్‌లను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.