హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

NZB: మెండోరా మండలం పోచంపాడ్ ఎక్స్‌రోడ్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సావెల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా, నిర్మల్ నుంచి ఆర్మూర్ వైపు వేగంగా వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.