SRD: జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో విద్యుత్ నిలిచిపోవడంతో వార్డులన్నీ చీకటిగా మారాయి. ఆటోమేటిక్ జనరేటర్ పనిచేయకపోవడంతో రోగులు, సహాయకులు సెల్ ఫోన్ లైట్ల వెలుగులోనే ఇబ్బందులు పడ్డారు. అనంతరం సిబ్బంది మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరించారు. ఆస్పత్రిలో తరచూ జనరేటర్ సమస్య తలెత్తుతోందని, అధికారులు స్పందించి పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.
తెలంగాణ
ఆస్పత్రిలో అంధకారం: రోగుల అవస్థలు


