అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జార్పేటా జిల్లాలోని హైవే 27పై BSF సిబ్బందితో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆ బస్సు డ్రైవర్ మృతి చెందాడు. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న 32 మంది BSF సిబ్బంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
వార్తలు
ఘోర ప్రమాదం.. 32 మంది జవాన్లకు గాయాలు


