BPT: మర్చూరు, ఇంకొల్లు మండలాల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేడు పర్యటించనున్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి పాల్గొంటారని టీడీపీ వర్గాలు తెలిపారు. ఇసుకదర్శి గ్రామంలో 13 సీసీ రోడ్లు, ఇసుకదర్శి- అంబడిపూడి రహదారిని మంత్రి శుక్రవారం సాయంత్రం ప్రారంభిస్తారని వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్
నేడు రెవెన్యూ మంత్రి అనగాని రాక


