హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల సేవలపై ఫోటోగ్రఫీ షార్ట్‌ఫిల్మ్ పోటీలు

MDK: పోలీసుల నిరంతర సేవలు, ప్రజా భద్రత, విధి నిర్వహణపై మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఫోటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్ పోటీలు ప్రకటించింది. ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహించే ఈ పోటీల్లో ప్రతిభావంతులు 3 ప్రతిభావంతమైన ఫోటోలు లేదా 3 నిమిషాల షార్ట్‌ఫిల్మ్‌ను అక్టోబర్ 22వ తేదీలోగా పీఆర్‌ఓ సెక్షన్‌కు సమర్పించాలి. ఆసక్తిగల పౌరులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.