హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా రద్దీకి ప్రత్యేక రైలు.. పాలమూరులోనూ స్టాప్

GDWL: దసరా రద్దీ దృష్ట్యా బెంగళూరు యశ్వంత్‌పూర్‌–సహర్సా మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక రైలు కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూలు స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. ఇందులో ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.