MBNR: మిడ్జిల్ మండలం తుప్పుడగడ్డ తండాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు పడిపోయాయి. బోర్లలో నీరు అడుగంటిపోవడంతో 6 ఎకరాల వరి పంట ఎండిపోయిందని రైతు నాను నాయక్ వాపోయారు. రూ.1,50,000 పెట్టుబడి పెట్టగా, నీరు అందక పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు కావడంతో మనస్తాపంతో పంటను ఎడ్లకు మేతగా వదిలేశానని బోరున విలపించాడు.
తెలంగాణ
VIDEO: రైతుకు చి'వరి' కి మిగిలింది కన్నీరే..!


