హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభమైన యూనియన్ ఎన్నికల పోలింగ్

BDK: కొత్తగూడెం ఆర్టీసీ డిపోలో యూనియన్ గుర్తింపు ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. కార్మికులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది.