హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్ చోరీ కేసులో నిందితుడికి ఏడాది జైలు

AKP: గొలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైక్ చోరీ కేసులో విజయవాడకు చెందిన పసుపులేటి రాము (25)పై నేరం రుజువైంది. దీంతో నర్సీపట్నం అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఏడాది సాధారణ జైలు శిక్ష విధించింది. కేసును సమర్థంగా దర్యాప్తు చేసి శిక్ష పడేలా కృషి చేసిన ఎస్సై పి.రామారావు,ఏపీపీ శశికాంత్ సిబ్బందిని ఎస్పీ తుహిన్ సిన్హా గురువారం అభినందించారు.