హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్ములమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు

GDWL: గద్వాల జిల్లా కేంద్రం పరిధిలోని జమ్మిచేడులో కొలువైన శ్రీ జమ్ములమ్మ అమ్మవారి దేవాలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారిని విశేష పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నరు.