తిరుమలలోని సర్వదర్శనం క్యూలైన్‌లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2, నారాయణగిరి షెడ్లలో సీసీ కెమెరాలు ఉన్నాయి. దీంతో పాటుగా రింగురోడ్డులోని సర్వదర్శనం క్యూలైన్‌లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేయడంలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తితిదే భద్రతాధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సర్వదర్శనం క్యూలైన్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు


