హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే చదలవాడ

PLD: నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన జగదీశ్ ఆదాహళ్లిని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు గురువారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజాహిత చర్యలకు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.