హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీబీ రహిత భారతే లక్ష్యం: కలెక్టర్

KRNL: 2030 నాటికి టీబీ రహిత భారత్‌ను సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా బాధితులకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 1,200 మంది బాధితులకు కిట్లు అందించినట్లు వెల్లడించారు. టీబీ లక్షణాలను ప్రారంభ దశలో గుర్తించి, చికిత్సను పూర్తిగా కొనసాగించాలని సూచించారు.