హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహనాల వేలం.. రూ.5.11 లక్షల ఆదాయం

BHPL: కాటారం మండల కేంద్రంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో స్వాధీనం చేసుకున్న 39 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో కలిపి 40 వాహనాలకు గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రారంభ ధర రూ.3,34,400 కాగా, వేలం ద్వారా జీఎస్టీతో కలిపి రూ.5,11,530 ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్‌ సీఐ కరుణశ్రీ తెలిపారు.