హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికలు చదువుపై దృష్టి పెట్టాలి: జడ్జి స్వాతి

మహబూబాబాద్ పట్టణంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి స్వాతి మురారి విద్యార్థినులకు బాలల హక్కులు, పోక్సో చట్టం, ఉచిత న్యాయసేవలపై అవగాహన కల్పించారు. క్షణిక ఆకర్షణలకులోనై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు.