హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

11న రెండు కేంద్రాల్లో ప్రత్యేక టెట్

ప్రకాశం: ఒంగోలు నగరంలో ఎంపిక చేసిన రెండు కేంద్రాల్లో ఈ నెల 11 నుంచి 15 వరకు స్పెషల్ టెట్ జరుగుతుందని డీఈవో రేణుక పేర్కొన్నారు. ట్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్, నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చి సోషల్ యాక్షన ఇండియా కళాశాలలో జరుగుతాయన్నారు. ఆన్‌లైన్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సమయానికి గంటన్నర ముందుకు చేరుకోవాలన్నారు. సమాచారం కోసం 9989083446ను సంప్రదించాలన్నారు.