హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్పెషల్‌ ఎడ్యుకేటర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

KMR: బీర్కూర్ PM శ్రీ పాఠశాలలో గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ వెంకన్న తెలిపారు. బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, సంబంధిత డిప్లొమా లేదా పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 15వ తేదీ వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.