హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోస్తాలో తుఫాన్ ముప్పు: ఐఎండీ

GNTR: ఆగ్నేయ బంగాళాఖాతంలో అక్టోబర్ 13 నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ వెల్లడించింది. తర్వాతి నాలుగు రోజుల్లో వాయవ్యంగా కదిలి బలపడి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని, దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు వైపు రావచ్చని అంచనా వేసింది. అక్టోబర్ 15 తర్వాత కోస్తాలో వర్షాలు మొదలై, కొన్నిచోట్ల భారీ వర్షాలు పడొచ్చు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3–5 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి.