ఏలూరు: నగరంలోని లాడ్జిల్లో ఈగల్ పోలీసులు గురువారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 1,2,3 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని లాడ్జిల్లో అనుమానాస్పద వ్యక్తుల వివరాలు, కదలికలను పరిశీలించారు. అనుమానాస్పదంగా గుర్తించిన ఆరుగురికి గంజాయి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ గా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్ త్రిశూల్ లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరులోని లాడ్జిల్లో తనిఖీలు..!


