హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జెండాకట్టను అభివృద్ధి చేస్తాం: సుజాతమ్మ

NDL: డోన్ పట్టణంలోని 12వ వార్డు జెండాకట్ట ప్రాంతంలో గురువారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పర్యటించారు. స్థానిక ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా మంజూరైన సీసీ రోడ్ల వివరాలను వెల్లడించి, వాటితో కలిగే ప్రయోజనాలను వివరించారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.