హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళ అదృశ్యం.. కేసు నమోదు..!

KDP: కలసపాడు మండలం తెల్లపాడుకు చెందిన వెంకటరమణ తన భార్య శ్రుతి అదృశ్యమైనట్లు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత నెల 26న వరికుంట్ల కనకదుర్గమ్మ ఆలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లు ఎస్సై హనుమంతు తెలిపారు. ఈ నెల 5న శ్రుతిని ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లారని, అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై వెల్లడించారు.