హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత!

CTR: చిత్తూరు రూరల్ మండలం అనుపు గ్రామం వద్ద తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు. బొలెరో వాహనంలో క్యూఆర్ కోడ్ ఉన్న బ్యాగుల నుంచి బియ్యాన్ని పాలిథిన్ బ్యాగుల్లోకి మార్చి తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్, యజమానిపై 6-ఏ కేసు నమోదు చేశారు.